English | Telugu

ఢిల్లీలో కేజ్రీవాల్ సూపర్ విక్టరీ... మోడీ అండ్ టీమ్‌కి మళ్లీ నిరాశే...

ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. మరోసారి బంపర్ మెజారిటీతో కేజ్రీవాల్ ఢిల్లీ పీఠాన్ని అధిష్టిస్తారన్న లెక్కలు లెక్కతప్పలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ 50కి పైగా స్థానాల్లో ఘనవిజయం సాధించింది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో పోలిస్తే దాదాపు 15 స్థానాలు కోల్పోయింది. ఇక, ఈసారి ఢిల్లీ పీఠం తమదేనంటూ ధీమాతో ముందుకెళ్లిన బీజేపీకి మరోసారి నిరాశే మిగిలింది. గత ఎన్నికలతో పోలిస్తే పుంజుకున్నప్పటికీ 20 స్థానాలను కూడా సాధించలేకపోయింది. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలంతా మోహరించి ప్రచారం చేసినా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. దాంతో, బీజేపీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. ఇక, మరోసారి ఘనవిజయం సాధించి రెండోసారి అధికారాన్ని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.