English | Telugu
అమెరికా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భారత సంతతి మహిళ పోటీ
Updated : Aug 12, 2020
కమలాదేవి హారిస్ ఓక్లాండలో జన్మించారు. ఆమె తల్లి డాక్టర్ శ్యామల గోపాలన్. రొమ్ము క్యాన్సర్ శాస్త్రవేత్త. తమిళనాడు నుంచి 1960లో యుసి బర్కిలీలో ఎండోక్రినాలజీలో డాక్టరేట్ చేయడానికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తండ్రి డోనాల్డ్ హారిస్. జమైకా నుంచి అమెరికా వచ్చారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ ఎమెరిటస్ ప్రొఫెసర్. భారత్ ఆఫ్రో-జమైకా సంతతికి చెందిన హారిస్ అమెరికాలో పుట్టి పెరిగారు.
కమల హోవార్డ్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. హేస్టింగ్స్ కాలేజ్ ఆఫ్ లా నుంచి న్యాయవిద్యను పూర్తి చేసిన ఆమె శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గాను విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఆమె సెనేటర్ గా ఎన్నికయ్యారు. అమెరికా సెనేటర్ గా పనిచేసిన తొలి దక్షిణాసియా అమెరికన్ సెనేటర్ గా పేరు నమోదు చేసుకున్నారు. అయితే 2020 ఎన్నికల్లో అధ్యక్షపదవి రేసులో ఆమె పేరు ఉంది. తాజాగా జరిగిన పరిణామాల అనంతరం ఆమె ఉపాధ్యక్షురాలిగా, జో బిడెన్ అధ్యక్షుడిగా పోటీ చేయనున్నారు.