English | Telugu
బెంగాల్ లో బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్ పై రాళ్ల దాడి
Updated : Dec 10, 2020
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకోసం పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశమవడానికి జేపీ నడ్డా బెంగాల్ వెళ్లారు. డైమండ్ హార్బర్‌కు వెళ్తుండగా ఇరుకైన దారిలో కొందరు గుమిగూడి నడ్డా కాన్వాయ్‌ను అడ్డగించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలను పోలీసులు నిలువరించినా రాళ్లను అడ్డుకోలేకపోయారు. దాడి జరగ్గానే పోలీసులు ప్రత్యేకంగా ఎస్కార్ట్ చేసి బీజేపీ నేతలు ఆ ప్రాంతం నుంచి బయటకు తీసుకెళ్లారు. టీఎంసీ గూండాలే నడ్డా కారుపైకి రాళ్లు విసిరారని దిలీప్ ఘోష్ ఆరోపించారు. బుధవారం జరిగిన నడ్డా పర్యటనలోనూ భద్రతాపరమైన లోపాలు కనిపించాయని, టీఎంసీ సర్కారు సరైన సెక్యూరిటీ కల్పించడం లేదని ఆరోపిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బెంగాల్ బీజేపీ నేతలు లేఖ రాశారు. అయితే దారిపొడవునా ప్రతి అంగుళం భద్రతా కల్పించడం అసాధ్యమని, అప్పటికప్పుడు ప్రజలు తిరుగుబాటు ధోరణిలో దాడి చేసి ఉండొచ్చని భావిస్తున్నట్టు టీఎంసీ నేత మదన్ మిత్రా స్పందించారు.