తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్నఇవ్వాలన్న తీర్మానం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టగా ఎంఐఎం వ్యతిరేకించింది. ఎంఐఎం సభ్యులు సభకు గైరాజరు అయ్యారు. దేశ ప్రధానిగా, కేంద్ర మంత్రిగా, ఆర్థిక సంస్కర్తగా పీవీ చేసిన సేవలను సభ్యులు మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్రం భారతరత్న ఇవ్వాలని సభలో మాట్లాడిన సభ్యులంతా స్పష్టం చేశారు. అసెంబ్లీ లో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. పీవీ సేవలను గుర్తించి శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, దక్షిణాది నుంచి ప్రధానికిగా దేశానికి సేవచేసిన పీవీ మన ఠీవీ అని ముఖ్యమంత్రి కొనియాడారు.
తెలంగాణ అసెంబ్లీ చేసిన మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీవీకి భారతరత్నపై తీర్మానం చేయాలని మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఇగోలకు, పట్టింపులకు పోకుండా తెలంగాణ తరహాలో ఏపీలోనూ తీర్మానం చేయాలని ఐవైఆర్ సూచించారు.