English | Telugu
సిద్దిపేటకు మళ్లీ వెంకటరామిరెడ్డి! తెలంగాణలో పలువురు కలెక్టర్లు బదిలీ
Updated : Nov 13, 2020
ఇప్పటి వరకు సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న మంచిర్యాల కలెక్టర్ భారతి హొళికెరిని మళ్లీ మంచిర్యాలకు ట్రాన్స్ ఫర్ చేసింది ప్రభుత్వం. ఆ జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిక్తా పట్నాయక్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న శశాంకకు ఆ బాధ్యతల నుంచి విముక్తి కల్పిస్తూ ఆ స్థానంలో హొళికెరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వి.వెంకటేశ్వర్లు బదిలీ కాగా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి మల్కాజిగిరి జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు.