English | Telugu
రాజ గురువు జన్మదిన వేడుకలు.. ఏపీ సర్కార్ వివాదాస్పద ఆదేశాలు!
Updated : Nov 13, 2020
ఇటీవల స్వరూపానందకు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఘనంగా స్వాగతం పలికి.. అక్కడి నుంచి వారిని తిరుమల తీసుకువెళ్లారు. ఓ పీఠాధిపతికి అదనపు ఈవో, పాలకమండలి సభ్యుడు స్వాగతం పలికడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శల నుంచి ఇంకా బయటపడకముందే, స్వరూపానంద విషయంలో తాజాగా వివాదాస్పద ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వం అభాసుపాలయింది.
కాగా, గత సంవత్సరం కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామి విజయేంద్ర సరస్వతి స్వామి చాతుర్మాస్య దీక్షలో విజయవాడలో ఉంటే రెండు నెలలపాటు ఒక్క ఆలయం వారు మర్యాదగా కూడా దర్శించు కోలేదు. సనాతన సర్వజ్ఞ జగద్గురు కంచి పీఠాధిపతులను పట్టించుకోని దేవాదాయ శాఖ.. స్వయంప్రకటిత విశాఖ పీఠానికి ఊడిగం చేస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.