English | Telugu

పక్కా ప్లాన్.. ప్రియాంకని ఇలా ట్రాప్ చేశారు.. ఆ తరువాత 5 గంటలు?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశు వైద్యురాలి అత్యాచారం హత్య కేసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అఘాయిత్యానికి పాల్పడే క్రమంలో అత్యంత ఘోరంగా ప్రవర్తించారు నిందితులు. మృగాల తరహాలో విరుచుకుపడి 45 నిమిషాల పాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బలవంతంగా మద్యం తాగించి మరీ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

షాద్ నగర్ పశు వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటనలో నిందితుల పైశాచికత్వం బయటపడుతోంది. స్కూటర్ కోసం వేచి చూస్తున్న ప్రదేశం నుంచి మహ్మద్, శివ, నవీన్ లు ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో బాధితురాలు సాయం కోసం అరిచినా వాహనాల రాకపోకల శబ్దానికి ఆమె వేదన అరణ్యరోదనగానే మిగిలింది. ఆ తర్వాత దుండగులు ఆమె నోరు నొక్కి లాక్కెళ్లారు. ఆమె బయటకు కనబడకుండా లారీని అడ్డుగా వాడుకున్నట్లు తెలుస్తోంది. ప్రతిఘటించేందుకు ప్రయత్నించినా మద్యం మత్తులో ఉన్న దుండగులు ఆమె కాళ్లు చేతులు పట్టుకొని పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. అంతటితో ఆగక వారి వెంట తెచ్చుకున్న మద్యాన్ని బలవంతంగా ఆమె నోట్లో పోశారు. రాత్రి 10 గంటల 20 నిమిషాల వరకు రాక్షస కాండను కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలింది.

ఘటనాస్థలిలో పోలీసులు ప్రియాంక రెడ్డి లోదుస్తులు, పర్సు, చెప్పులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మొదట్లో మొబైల్ ఫోన్, స్కూటర్ కనిపించలేదు. గురువారం సాయంత్రం కొత్తూరు జేపీ దర్గాకు సమీపంలో పోలీసులు ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. ఫోన్ నిందితుల దగ్గర ఉండొచ్చని పోలీసులు భావించారు. కానీ వారి వద్ద ఫోన్ దొరకలేదు. మరోవైపు నలుగురు నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. బుధవారం రాత్రి సోదరితో ఫోన్ సంభాషణలోనూ ఓ చిన్న కుర్రాడు పంచర్ వేయించేందుకు బండిని తీసుకెళ్లినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. పోలీసులు మాత్రం నిందితులంతా 20 ఏళ్లకు పైబడిన వారేనని మనకు స్పష్టం చేశారు. కేసులో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.