English | Telugu
హైదరాబాద్ లో ప్రతి వెయ్యిమందికి 30 సీసీ కెమెరాలు
Updated : Jul 23, 2020
ప్రతి వెయ్యిమందికి 30 సీసీకెమెరాలు
ప్రపంచంలోని పెద్దనగరాల్లో తీసుకుంటున్న భద్రత చర్యల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కవి గాంచని చోటు రవిగాంచును అన్న విధంగా పోలీసు తెలుసుకోలేని ఎన్నో విషయాలు సీసీ కెమెరాలు పట్టిస్తాయి. నేరాల విచారణలో సీసీ కెమెరాల ఫుటేజ్ కీలకంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాలు భద్రత కోసం సీసీకెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను తగ్గించి, భద్రత సులభతరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో లండన్ కు చెందిన కంపారిటెక్ అనే కంపెనీ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అత్యదిక సీసీటీవిలు కలిగిన 20 నగరాల జాబితాలో లండన్, హైదరాబాద్ మినహా మిగిలిన 18 నగరాలు చైనాలోనే ఉన్నాయి.
మొదటి స్థానంలో ఉన్న చైనాలోని తైయువాన్ సిటీలో ప్రతి వెయ్యిమందికి 119 సీసీకెమెరాలు ఉన్నాయి. ఈ నగరం మొత్తంలో 4.65 లక్షల సీసీ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. బీజింగ్ నగరంలో 11.50 లక్షల సీసీకెమెరాలను ఏర్పాటుచేశారు. 15వ స్థానంలో ఉన్న హైదరాబాద్ లో ప్రతి వెయ్యిమందికి 30సీసీకెమెరాల ఉండగా నగరం మొత్తంలో దాదాపు 3లక్షల సీసీకెమెరాలు ఏర్పాటుచేశారు. 21స్థానంలో ఉన్న చెన్నైలో ప్రతి వెయ్యిమందికి 25 సీసీకెమెరాలున్నాయి. 33వ స్థానంలో ఉన్న ఢిల్లీ నగరంలో ప్రతివెయ్యిమందికి 14 సీసీకెమెరాలున్నాయి.