English | Telugu
త్వరలో రోడ్డెక్కనున్న హైదరాబాద్ సిటీ బస్సులు
Updated : Sep 19, 2020
అయితే తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులను పున ప్రారంభించేందుకు ముహుర్తం ఖరారు అయ్యింది. కరోనా సమస్య ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లోని మెట్రో నగరాల్లో సిటీ బస్సులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయి. ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో ఇప్పటికే బస్సులు తిరుగుతుండటంతో… అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసిన తెలంగాణ ఆర్టీసీ అధికారులు.. మొదట దశలో 50శాతం బస్సులను నడిపి, తరువాత దశల వారీగా బస్సులను పెంచాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ప్రయాణికులను కేవలం సీట్ల వరకే పరిమితం చేయాలనీ నిలబడి, లేదా కిక్కిరిసేలా ప్రయాణికులను ఎక్కించకూడదని అధికారులు నిర్ణయించారు. దీంతో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే 7 రూట్లలో సిటీ బస్సు సర్వీస్‌లు ముందుగా ప్రారంభించే అవకాశం ఉంది. ఒకసారి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ నెలాఖరుకు సిటీ బస్సులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.