English | Telugu

భారత్ చైనా సరిహద్దులో ఘర్షణ.. ముగ్గురు భారత్ జవాన్ల మృతి

కొంత కాలంగా చైనా భారత భూభగంలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతూన్న విషయం తెలిసిందే. తాజాగా సరిహద్దులోని గాల్వాన్ లోయ ప్రాంతం లో సోమవారం రాత్రి చైనా సైనికుల దాడిలో ఒక కల్నల్ తో పాటు ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. ఒక పక్క రెండు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతుండగా ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల సైన్యాల మధ్య తోపులాట జరిగిన సందర్భాలు ఉన్నాయి కానీ గత 45 ఏళ్ల లో హింస జరగడం మాత్రం ఇదే మొదటి సారి.

గల్వాన్ లోయలో ఒక ప్రాంతాన్ని విడిచి వెళ్లేందుకు చైనా సైనికులు నిరాకరించడం తో ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో 16 బీహార్ రెజిమెంట్ కు చెందిన ఒక కమాండింగ్ ఆఫీసర్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 1962 లో భారత్ చైనా మధ్య యుద్ధం జరిగిన ప్రాంతాల్లో గుల్వాన్ లోయ కూడా ఉంది. ఐతే ఇక్కడ తాజాగా భారత్ రోడ్ నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం మన బలగాలు గాల్వన్ లోయకు చేరాలంటే 8 గంటలకు పైగా సమయం పడుతుంది ఐతే ఈ రోడ్ పూర్తయితే మన బలగాలు బోర్డర్ కు కేవలం అర గంటలోనే చేరుకుంటాయి. దీంతో ఈ రోడ్ నిర్మాణాన్నీ చైనా సైన్యం ఇండైరెక్ట్ గా అడ్డుకుంటోంది.