English | Telugu
జగన్ ప్రభుత్వం పై మండిపడ్డ ఏపీ హైకోర్టు..
Updated : Sep 9, 2020
పుష్కరాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయమని మిమ్మల్ని ఎవరైనా అడిగారా?.. లేక రంజాన్ తోఫా, క్రిస్‌మస్ కానుకలు ఇవ్వమని ఎవరైనా అడిగారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వెయ్యమని మిమ్మల్ని ఎవరైనా అడిగారా.. అని కోర్టు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. పేదల సంక్షేమం కోసం పథకాలు అమలు చేయడాన్ని ఎవరూ కాదనరని, అయితే పెన్షన్లు ఆపిన వితంతువులకు 15 రోజుల్లోగా పెన్షన్లు ఇవ్వాలని, పాతపెన్షన్లు ఇవ్వడంతో పాటు భవిష్యత్‌లో కూడా పెన్షన్లు చెల్లించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.