English | Telugu
పదేళ్లపాటు ఏం చేశారు.. ఇప్పుడు స్టే ఇవ్వలేం! జీహెచ్ఎంసీ ఎన్నికపై హైకోర్టు
Updated : Nov 16, 2020
పిటిషనర్ తరపు లాయర్ వాదలనపై స్పందించిన హైకోర్టు.. పిల్ దాఖలు చేసిన శ్రవణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంబీసీలపై ప్రేమ ఉంటే పదేళ్ల నుంచి ఎందుకు స్పందించలేదనని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికల షెడ్యూల్ ఇవ్వబోయే చివరి క్షణంలో ఆ విషయం గుర్తొచ్చిందా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. దురుద్దేశంతో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారని.. ఎన్నికలు ఆపే రాజకీయ ప్రణాళికతో పిల్ దాఖలు చేశారని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్ విచారణ చేపడతాం కానీ.. ఎన్నికలపై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.