English | Telugu

డాక్టర్ సుధాకర్ కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు

ఏపీ హైకోర్టులో డాక్టర్ సుధాకర్ తల్లి కావేరి బాయి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై ఈ రోజు విచారం జరిగింది. అటు సిబిఐ కానీ ఇటు పోలీసులు కానీ డాక్టర్ ను అరెస్ట్ చేయలేదని అటువంటి పరిస్థితులలో ఆయనను హాస్పిటల్ లో ఎలా బంధిస్తారని ఆమె ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. దీని పై రెండు పక్షాల వాదనలు విన్న తరువాత న్యాయస్థానం హాస్పిటల్ నుండి సుధాకర్ డిశ్చార్జ్ కు అనుమతిచ్చింది. మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ అనుమతి తో ఆయన డిశ్చార్జ్ అవ్వచ్చని కోర్టు తెలిపింది. ఇదే హాస్పిటల్ లో గత నెల 16 నుండి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఐతే అయన సిబిఐ విచారణ కు మాత్రం సహకరించాలని స్పష్టం చేసింది.

ఇది ఇలా ఉంటే ఈ కేసు విషయం లో సిబిఐ తన ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తోంది. డాక్టర్ సుధాకర్ పని చేస్తున్న నర్సీపట్నం హాస్పిటల్ లో విచారించిన అధికారులు తరువాత నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ ను అడిగి మరిన్ని వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది.