English | Telugu
హైకోర్టులో ఏసీబీకి ఎదురు దెబ్బ.. హాస్పిటల్ కు షిఫ్ట్ చేయమని ఆదేశాలు
Updated : Jul 8, 2020
ఏసీబీ అరెస్ట్ కు ఒక రోజు ముందు అచ్చెన్నాయుడు కు పైల్స్ ఆపరేషన్ జరగడంతో జడ్జ్ ముందు హాజరు పరిచి ఆయనను గుంటూరు జీజీహెచ్ లో చేర్చి చికిత్స అందించారు. అయితే జూలై 1న గుంటూరు ప్రభుత్వాస్పత్రి నుంచి పూర్తిగా కోలుకోకుండానే డిశ్చార్జి చేసారు. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు నేరుగా విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. అయితే ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఆయన్ను బలవంతంగా డిశ్చార్జి చేశారని అపుడే టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు.