English | Telugu

మైల విధానం నేటి ఐసోలేషన్ పరిమిత పద్ధతి ఒకటేనా?

అవునంటోంది భార‌తీయ స‌నాత‌న ధ‌ర్మం. మ‌న పూర్వీకులు అప్ప‌ట్లో చెప్పిన *మైల విధానం నేటి ఐసోలేషన్ పరిమిత పద్ధతి ఒకటే. సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో చెబితే చాదస్తం అన్నారు. ఇంగ్లీష్‌లో చెబితే మ‌న వాళ్ల‌కు బాగానే అర్థం అయింది. అదే మ‌న భార‌తీయ భారతీయత ఔన్నత్యం.

అప్ప‌ట్లో పురుడు వచ్చినా ఎవరి ఇంట్లోనైనా మరణం సంభవించినా మైల పాటించ‌డం ఆచారంగా వుండేది. ఈ విధానం భారతీయ సనాతన ధర్మం. అయితే చ‌దువు ఎక్కువైయ్యే స‌రికి దానిని చాదస్తం లేదా మూఢనమ్మకం అంటూ కొట్టి పారేస్తున్నాం. అయితే క‌రోనా దెబ్బ‌కు అస‌లు విష‌యం బోధ‌ప‌డుతోంది.

ఒక ఇంటిలో శిశువు జన్మిస్తే, ఆ సమయములో తల్లి గర్భము నుంచి కలుషిత వ్యర్ధాలు అనగా నెత్తురులాంటివి అనేకం వెలువడతాయ్. అవి వాతావరణములో అనేక హానికారక సూక్ష్మజీవులు(వైరస్) ఉత్పత్తికి దోహదం చేస్తాయి ఆ పరిసర ప్రదేశాలలో అంటే ఆ ఇంటిలో లేదా ఆ గదిలో. ఆ యజమానికి సంబంధించిన దగ్గరి (అన్నదమ్ముల కుటుంబాలు) బంధువులు పరామర్శకి వచ్చి అక్కడ ఉండి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అటువంటి వారిని ఈ వైరస్ ఆశ్రయించే అవకాశం ఉంటుంది. సాధారణముగా వైరస్ జీవన ప్రమాణం 10 రోజులు. అందుకే 11వ రోజున ఆ వ్యక్తులందరూ పసుపు కలిపిన నీటితో సంపూర్ణ స్నానం చేస్తారు. అక్కడి వస్తువులన్నీ పసుపు(క్రిమి సంహారిణి) కలిపిన నీటితో శుద్ధి చేస్తారు. దీనినే పురిటి శుద్ధి అంటారు.

అలాగే మరణం కారణముగా ఏర్పడే మైలతో మృత‌దేహం చుట్టూ క్షణాలలో చీమలు అపరిమితముగా గుమిగూడుతుంటాయ్. వాతావరణములో మార్పుల కారణముగా కనపడని సూక్ష్మజీవులు ఇంకెన్ని కోట్లలో ఆ ప్రదేశములో గుమిగూడతాయో చెప్పలేము. ఆ సమయములో ఆ ఇంటి పేరువారు, వారి కులం వారు అక్కడికి వచ్చి ఉంటారు. సూక్ష్మజీవులు జీవనప్రమాణం ఆధారంగా 11వ రోజు శుద్ధి స్నానం చేయమంది శాస్త్రం.

పెండ్లి అయిన ఆడబడుచులను ఇత్యాది వారిని 4వ రోజున శుద్ధి స్నానం చేయమంది. కారణం వారు సాధారణముగా వారి వారి కుటుంబాల‌కు వెళ్ళిపోతారు. శవ దహనం తరువాత. అంటే వైరస్ వ్యాప్తి తగ్గుముఖం ఉండే స్థానాలకు తిరిగి వెళ్లిపోయేరు కాబట్టి 3 రోజులు మైలగా పరిగణిస్తారు.

అదే విధముగా శవం ఉన్న సమయములో చుట్టుపక్కల వంట వంటి కార్యక్రమాలు నిషేధించి ఆ ప్రాంతము నుంచి శవం తొలగించిన తరువాత అక్కడి నివాసులు స్నానం చేసి వంట భోజన కార్యక్రమాలు చేపట్టమన్నారు. ఈ విధానాన్ని భారతీయ సనాతన ధర్మం మైల అన్నది.

దీనినే ఇప్పటి శాస్త్రవిజ్ఞానం (సైన్స్) ఇమ్మ్యూనిటి అనే పేరుతో సూక్ష్మజీవ ప్రభావ రోగులను ఐసోలేషన్ ప్రాంతాలలో పెట్టి ఆరోగ్యవంతులకు దూరముగా పెడుతున్నారు. అది విష‌యం.