English | Telugu
జగన్ సర్కార్ కు మరో షాక్.. టీడీపీ నేతలకు ఊరట
Updated : Aug 27, 2020
ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతలు గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే పోతుల రామారావులకు సంబంధించిన గ్రానైట్ క్వారీల లీజులు రద్దు చేస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్వారీయింగ్‌లో లోపాలు ఉన్నాయని ఇద్దరు నేతల క్వారీల లీజు రద్దు చేసింది. ప్రభుత్వ ఆదేశాలపై టీడీపీ నేత పోతుల రామారావు హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్షతోనే లీజులు రద్దు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు చట్టబద్దంగా లేవని అభిప్రాయపడింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.