English | Telugu
కొనసాగుతున్న గోదావరిలో మునిగిపోయిన బోటును బయటకు తీసే ప్రయత్నాలు...
Updated : Oct 16, 2019
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు సమీపంలో గోదావరిలో మునిగిపోయిన బోటును బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గోదావరి వరద తగ్గటంతో ధర్మాడి సత్యం టీమ్ రంగంలోకి దిగి ఆపరేషన్ కొనసాగిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన బోట్ వెలికితీత పనులు మళ్లీ రెండో రోజు కొనసాగుతున్నాయి. అయితే నిన్నంతా దేవీపట్నం నుంచి కేవలం ఐరన్ రోప్ లతో పాటు తాళ్లు అన్నీ తీసుకొని అలాగే ధర్మాడి సత్యం బృందంకి సంబంధించి ఒక ఇరవై ఐదు మంది బృందం దేవీపట్నం నుంచి కచ్చులూరుకు రావడం జరిగింది.
మళ్లీ పంటల మీద ఉన్న రోప్ అంతటిని కూడా గోదావరి మధ్యలోకి ఎక్కడైతే ప్రమాదం జరిగిందని చెప్తున్నారో ఆ ప్రమాద ఘటన జరిగిన స్థలం దగ్గర నుంచి రోప్ లు వేసుకొని రావటం జరుగుతుంది. గోదావరి వరద ఉధృతి తగ్గు ముఖం పట్టడంతో గోదావరి లోతు కూడా తగ్గింది. ఘటన జరిగిన సమయంలో చూసినట్లయితే రెండు వందల పదిహేను అడుగుల వరకు ఉన్న గోదావరి వరద నీటి మట్టం ఇప్పుడు సుమారు ముప్పై నుండి నలభై అడుగుల వరకు దాని నీటి మట్టం తగ్గడం జరిగింది.
స్తుతం మొత్తం నూట డెబ్బై నుంచి నూట ఎనభై అడుగుల వరకూ కూడా లోతు ఉండే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. రోప్ సాయంతోటి యాంకర్ లన్నింటినీ కూడా గోదావరిలోకి దింపడం జరిగింది. గోదావరిలోకి దింపిన తర్వాత అక్కడి నుంచి ఘటన ఎక్కడ అయితే జరిగిందో దానికి పదిహేను మీటర్లకి ముందు నుంచి ఈ యాంకర్ లన్నింటినీ వేయటం జరిగింది. ప్రస్తుతం నాలుగు యాంకర్ లను ఉపయోగిస్తున్నారు, ఈ నాలుగు యాంకర్లను కూడా పై నుంచి లాక్కొని వచ్చి అక్కడ నుంచి కూడా కిందకి లాక్కురావడం జరుగుతది.
ఎక్కడైతే పట్టుబడతదో ఆ పట్టుపట్టిన తరువాత అప్పుడు రోప్ సాయంతో లాగుతారు. ఇప్పటికే బోటు వెలికితీతకు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు కాగా తర్వాత సుమారు ఎనిమిది లక్షల వరకు కూడా ఖర్చు కావటం జరుగుతది. అయితే ధర్మాని సత్యానికి సంబంధించిన బాలాజీ మెరైన్ సంస్థ ఇరవై రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకు ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది.
ప్రభుత్వం ఇప్పటికే పది లక్షల ఖర్చు చేసిన కారణంగా ఒకవేళ బోటు తీయలేని పక్షంలో మొత్తం నష్టం వాటిల్లుతుందేమో అని చెప్పి ఎలాగైనా బోటును బయటకు తీయాలనే కృతనిశ్చయంతో సత్యం బృందం మొత్తం ప్రయత్నించడం జరుగుతున్నది.