English | Telugu
జర్మనీ మంత్రి ఆత్మహత్య
Updated : Mar 29, 2020
స్టేట్ ప్రీమియర్ బొఫీర్ ఈ విషయం మీద స్పందిస్తూ, థామస్ షెఫర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని నమ్మలేకపోతున్నామని, ఈ తరుణంలో ఇది తామందరికీ అత్యంత బాధ కలిగించే విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగాఉత్పన్నమైన ఆర్ధిక పరమైన సమస్యలను ఎలా అధిగమించగలమనే ఆందోళన వల్లనే థామస్ షెఫర్ ఆత్మహత్యకు పాల్పడివుండవచ్చునని ఆయన భావించారు.
హెస్సే వాస్తవానికి ప్రముఖ వాణిజ్య సంస్థలైన డ్యూషే బ్యాంక్, కామర్స్ బ్యాంక్ ల ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రాంతం. గడిచిన పదేళ్లుగా హెస్సే స్టేట్ కు థామస్ బొఫీర్ ఆర్ధిక మంత్రి గావ్యవహరిస్తున్నారు. ఈ కరోనా వైరస్ బారిన పడిన కంపెనీలను, ఉద్యోగులను, కార్మికులను ఆర్ధికంగా ఆదుకునే దిశగా చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన థామస్ షెఫర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.