English | Telugu

ఆర్మీలో చేరాలనుకునే వారికి తీపి కబురు చెప్తున్న సింగరేణి యాజమాన్యం

ఆర్మీలో చేరాలని చాలా మంది యువతకు ఆశ ఉంటుంది. ప్రతి ఏటా జరిగే ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో వేల సంఖ్యలో యువత పాల్గొంటోంది. సరైన అవగాహన శిక్షణ లేక పోవడంతో చాలా మంది ఎంపిక కాలేకపోతున్నారు. అతి కొద్ది మంది మాత్రమే ఆర్మీకీ ఎంపికవుతున్నారు .

ఆర్మీలో చేరాలనుకునే యువకుల ఆకాంక్షను తీర్చేందుకు సింగరేణి యాజమాన్యం వినూత్న ప్రయోగం చేస్తోంది. ఇందు కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంది. దీని కోసం అర్హత గల నిరుద్యోగ యువతకు జూలై మాసంలో ప్రాథమిక అర్హత పరీక్షలను సింగరేణి నిర్వహించింది.కోల్ బెల్ట్ లో ఔత్సాహిక యువతకు పకడ్బందిగా శిక్షణ అందిస్తోంది. కరీంనగర్ లో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ ఉండటంతో లక్ష్యం నెరవేరేలా ఫ్రీ ఆర్మీ రిక్రూట్ మెంట్ సెంటర్ల ద్వారా యువతను సన్నద్ధం చేస్తోంది.అందులో ప్రతిభ కనబరిచిన నాలుగు వందల యాభై మందిని ఎంపిక చేసింది ఆ బృందం. వీరికి గత రెండు నెలలుగా రెసిడెన్షియల్ తరహా లో ఉచిత శిక్షణ ఇస్తుంది.సింగరేణిలోని పదకొండు ప్రాంతాలకు నుంచి ఎంపిక చేసిన నాలుగు వందల యాభై మంది అభ్యర్థులకు రీజియన్ల వారీగా మూడు క్యాంపుల్లో శిక్షణ ఇస్తున్నారు. శారీరక శిక్షణ మాత్రమే కాదు, రాతపరీక్షల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు శిక్షణ తరగతులు కొనసాగుతున్నయి. అభ్యర్ధులు ఉదయం ఐదు గంటలకు లేచి ఆరుగంటల కల్లా ఫిజికల్ యాక్టివిటీకి సిద్ధం కావాల్సి ఉంది.

వ్యాయామంతో పాటు పరిగెత్తడం దూకడం బిస్కీలు తీయటం వంటివి చేయిస్తున్నారు. తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు లెక్క లు, సైన్స్, రీజనింగ్, ఇంగ్లిష్, సబ్జెక్టును బోధిస్తున్నారు. మధ్యాన్న భోజనం తర్వాత మూడున్నర నుంచి ఆరు గంటల వరకు తిరిగి ఫిజికల్ యాక్టివిటీ ఆటలు నిర్వహిస్తున్నారు.

రాత్రి ఏడున్నరకు భోజనం పెడుతున్నారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్ఫూర్తిదాయక పాఠశాల రివిజన్, రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాత పరీక్షలో శిక్షణ ఇవ్వటానికి రిటైర్డ్ ఉపాధ్యాయుల బృందాలను నియమించారు. కావలసిన పూర్తిస్థాయి మెటీరియల్ ను సమకూర్చారు. ఫ్రీ ఆర్మీ రిక్రూట్ మెంట్ శిక్షణ ఇవ్వడం రాష్ట్రంలోనే ప్రథమం అని ప్రభుత్వ సంస్థలు ఇటువంటి చొరవ చూపడం అరుదని ఆర్మీ రిక్రూట్మెంట్ విభాగం అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.