English | Telugu

రవి ప్రకాష్ అర్రెస్ట్ వెనుక కారణాలివే...

అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీకి చెందిన నిధులను రవిప్రకాష్ గోల్ మాల్ చేసినట్లు అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో పాటు షేర్ హోల్డర్స్ అనుమతి లేకుండా రవిప్రకాశ్ ఎం.కె. వీ.ఎన్ మూర్తి కంపెనీ నిధులను దారి మళ్లించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులను బ్యాంకు ఖాతాల నుంచి ఉపసంహరించి కంపెనీకి తీవ్ర నష్టం కలిగించారని అలంద మీడియా పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.

ఎ.బి.సి.ఎల్ కంపెనీలో తొంభై పాయింట్ ఐదు నాలుగు శాతం మెజారిటీ వాటాను అలంద మీడియా రెండు వేల పధ్ధెనిమిది ఆగస్టు ఇరవై ఏడున కొనుగోలు చేసింది. రెండు వేల పధ్ధెనిమిది సెప్టెంబర్ పధ్ధెనిమిది నుంచి రెండు వేల పధ్ధెనిమిది అక్టోబర్ ఇరవై నాలుగు మధ్య కాలంలో రవిప్రకాశ్ తో పాటు ఎం.కే.వి.ఎన్ మూర్తి కంపెనీ డబ్బును అనధికారికంగా విత్ డ్రా చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం పధ్ధెనిమిది కోట్ల ముప్పై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలను దారి మళ్లించినట్టు ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రవి ప్రకాష్ తో పాటు మొత్తం ముగ్గురు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. రవి ప్రకాష్ తో పాటు అతని వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు. రవి ప్రకాష్ పై వస్తున్న అభియోగాలపై పోలీసులు నోటీసులు పంపారు, నోటీసులకు స్పందించకపోవటంతో రవి ప్రకాష్ ను పోలీసులు అర్రెస్ట్ చేసినట్లు చెప్తున్నారు.