English | Telugu

హై అలెర్ట్.. భారత్‌లోకి ప్రవేశించిన కరోనా వైరస్‌

దాదాపు వందమందికి పైగా చైనీయులను పొట్టనపెట్టుకుని, చైనాతో పాటు ప్రపంచ దేశాల్ని వణికిస్తోన్న కరోనా వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. కేరళలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. చైనాలోని వుహాన్‌ యూనివర్శిటీలో చదువుతోన్న విద్యార్థి ఇటీవల కేరళకు వచ్చాడు. అయితే అతను అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేర్పించగా, పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతనికి కరోనా వైరస్ సోకిందని నిర్ధారించారు.

ఈ మేరకు భారత ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘బాధితుడికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నాం. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాం.’’ అని కేంద్రం ప్రకటించింది.