English | Telugu
రాజధానిలో భారీ అగ్ని ప్రమాదం.. పేలిపోయిన బ్యాటరీ ఫ్యాక్టరీ
Updated : Jan 2, 2020
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పీరాగర్హి లోని ఓ బ్యాటరీ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. బ్యాట్రీలు లీకవడంతో భారీ పేలుడు జరిగి పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ గోడలు కూలిపోయాయి. మొదట 9 ఫైరింజన్లు అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. అప్పటికే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారిని బయటకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా ఆ మంటలు వ్యాపించి ఫ్యాక్టరీ అంతటా మంటలు వ్యాపించాయి. ఆ క్రమంలో ఒక భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు దాటికి ఫ్యాక్టరీ గోడలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అందువల్ల రెస్క్యూ చేస్తున్న ఫైర్ సిబ్బంది కూడా ఫ్యాక్టరీ లోపల చిక్కుకు పోయిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. దీంతో అదనంగా మరిన్ని ఫైరింజన్లను అలాగే ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంధిని కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి పంపించారు. దాదాపు 35 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ముందు జాగ్రత్తగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా సమాచారం.