English | Telugu

మెట్ పల్లిలో భారీ అగ్రిప్రమాదం.. గన్నీ బ్యాగ్స్ గోడౌన్ లో 24 గంటలుగా అదుపులోకి రాని మంటలు

జగిత్యాల జిల్లా మెట్ పల్లి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్ పల్టిలోని వ్యవసాయ మార్కెట్ లో ఆదివారం ( ఆగస్టు 10) ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు సోమవారం (ఆగస్టు 11) ఉదయానికి కూడా అదుపులోనికి రాలేదు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని గన్నీ సంచుల గోదాంలో మంటలు చెలరేగాయి. సమాచారం తెలిసిన వెంటనూ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. భారీ పొగ కమ్ముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరు అగ్నిమాపక యంత్రాలతో గత 24 గంటలుగా మంటలు ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నా మంటలు అదుపులోనికి రాలేదు.

జేసీబీలతో గోడౌన్ గోడలు కూల్చి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నా.. భారీ సంఖ్యలో గోనె సంచులు ఉండటంతో అవన్నీ అంటుకుని పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. కాగా సంఘటనా స్థలాన్ని ఆదివారం (ఆగస్టు 10) రాత్రి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుకున్నారు. మంటలు పూర్తిగా అదుపులోనికి వచ్చిన తరువాత మాత్రమే నష్టం అంచనా వేయడానికి వీలౌతుందని అధికారులు తెలిపారు.