English | Telugu

ఏమైంది ఈ సమాజానికి.. కన్న కూతురిపైనే తండ్రి అత్యాచారం

గత వారం నుండి యాక్సిడెంట్లు.. రేప్ & మర్డర్లు.. అంటూ వచ్చే వార్తలే అందరిని కలిచివేస్తున్నాయి. నిందితులకు శిక్షలు కఠినంగా వేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా వార్తలను వింటూనే ఉన్న తరుణంలో మరో ఉదంతం చోటు చేసుకుంది. ఆగంతకుడు ఎవరో అమ్మాయిని చరిచి చంపితేనే మనం ఇంత మరిగిపోతున్నాము. అలాంటిది కన్న కూతురిపైనే తండ్రి అత్యాచారం చేసిన ఘటన కర్నూలు జిల్లా జిల్లెల గ్రామంలో చోటుచేసుకుంది. భార్య ఇంట్లో లేని సమయంలో కుమార్తె పై పలుమార్లు అత్యాచారం చేశాడు. బయటకు చెబితే ప్రాణాలు తీస్తానంటూ బెదిరించాడు.

వెంకటేశ్వర్లు భార్య స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో పని చేస్తోంది. గురువారం ఉదయం ఆమె డ్యూటీకి వెళ్లిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న తన 16 ఏళ్ల కుమార్తె పై తండ్రి అత్యాచారం చేశాడు. గత కొంతకాలంగా అమ్మాయి పై వెంకటేశ్వర్లు ఈ దారుణానికి పాల్పడుతున్నాడు. శుక్రవారం యువతి కడుపు నొప్పితో బాధపడుతుంటే తల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లింది. డాక్టర్లు పరీక్షించగా ఆమె అత్యాచారానికి గురైనట్టు నిర్ధారించారు. దీంతో కుమార్తెను తల్లి నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. కన్న తండ్రే ఈ దారుణానికి పాల్పడుతున్నాడని చెప్పింది. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి వారిని చంపితే కానీ మృగాళ్లా బయట తిరుగుతున్న మానవ పశువులను అదుపులో పెట్టలేమని నెటిజన్లు మండిపడుతున్నారు.