English | Telugu
ఈఎస్ఐ స్కామ్ లో వెలుగులోకి వస్తున్న విషయాలు...
Updated : Oct 2, 2019
ఈఎస్ఐ స్కామ్ లో తవ్వేకొద్ది అవినీతి బయటపడుతోంది. నిందితుల ఇళ్లతో పాటు అనుమానితుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారుల సోదాలు చేస్తున్నారు. ఈఎస్ఐ డైరెక్టర్ కార్యాలయంలో ఉండాల్సిన డాక్యుమెంట్లు పరిచేజ్ ఇండెంట్లను నిందితుల ఇళ్లలో పట్టుబడ్డాయి. ఓమ్నీ మెడీకి చెందిన నిందితుడు నాగరాజు ఇంట్లో అధికారిక పత్రాలు ఇండెంట్లు పర్చేజ్ ఆర్డర్ లు దొరికాయి. అతని ఇంట్లోనే నలభై ఐదు కోట్ల రూపాయల విలువ చేసే ఒరిజినల్ ఇండెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఈఎస్ఐ మెడికల్ స్కామ్ లో తవ్విన కొద్ది మొత్తం అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే ఎనిమిది మందిని అటు ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు. ఎనిమిది మందికి సంభవించిన ఇళ్లల్లో సోదాలు చేసినప్పుడు పెద్ద ఎత్తున పత్రాలను కూడా సోదా చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఈ స్కామ్ లో కీలకంగా ఉన్న ఓమ్ని మెడిఫార్మర్ కి సంబంధించినటువంటి ప్రతి నిధుల ఇళ్ళలలో కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సోదాలు చేయడం ప్రారంభించారు. దీనిలో ఇప్పటికే ఓమ్ని మెడీ ఫర్మర్ కు సంబంధించిన యజమాని బాబ్జిని ఏసీబీ అధికారు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఆ కంపెనీకి సంబంధించిన కొంతమంది ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధుల ఇండ్లలో పెద్ద మొత్తంలో సమాచారం ఉందని చెప్పి అటు బాబ్జీ చెప్పటంతో ఈ రోజు ఉదయం నుంచి అటు బాబ్జీకి సంబంధించిన ఉద్యోగుల ఇళ్ళలలో ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదా చేస్తున్నారు. ఈ సోదాలో ప్రధానంగా మెడికల్ డైరెక్టరేట్ ఆఫీసులో ఉండాల్సిన పత్రాలు మొత్తం కూడా నాగరాజు చెప్పి మిడిఫార్మాకి ఉద్యోగి ఇంట్లో మొత్తంగా నలబై ఆరు కోట్ల రూపాయలకు సంబంధినటువంటి పత్రాలు కూడా లభ్యం కావడం జరిగింది. ముందు ముందు ఈఎస్ఐ స్కామ్ లో ఏ ఏ విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.