English | Telugu

ఏకంగా కంపెనీ మహిళా సీఈఓకే అసభ్యకరమైన మెయిల్స్ పంపిన ఉద్యోగి!!

తాను పని చేసిన సంస్థ మహిళా సీఈఓ కు అసభ్యకరమైన మెయిల్స్ పంపుతూ ఓ ఉద్యోగి కటకటాలపాలయ్యాడు. కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మికాంత్ హైదరాబాద్ చిక్కడపల్లిలో నివాసముంటున్నాడు. అతనికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆన్ లైన్ బిజినెస్ కంపెనీల్లో డిజైనర్ గా పని చేస్తున్నాడు. ప్రేమిస్తున్నానంటూ ఏకంగా తను పని చేస్తున్న కంపెనీ సీఈవో కు కొన్ని రోజులుగా అసభ్యకరమైన ఈమెల్స్ పెడుతూ ఇబ్బంది పెడుతున్నాడు.

లక్ష్మీకాంత్ ఉద్యోగానికి సరిగా రాకపోవడంతో కొన్ని రోజుల క్రితం తొలగించారు. ఆ తరవాత నకిలీ ఇ-మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకుని ప్రేమిస్తున్నానంటూ సీఈఓకు మెసేజ్ లు పెడుతున్నాడు. అశ్లీల ఫోటోలు పంపుతున్నాడు. దీంతో విసిగిపోయిన ఆమె హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా లక్ష్మీకాంత్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.