English | Telugu

రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల

ఏప్రిల్‌లో ముగియనున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉదయం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 17 రాష్టాల నుంచి 55 మంది రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఏపీ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీ నుంచి ఎమ్.ఏ ఖాన్, సుబ్బిరామిరెడ్డి, కేశవరావు, తోట సీతారామలక్ష్మి.. తెలంగాణ నుంచి కేవీపీ, గరికపాటి మోహన్ రావు రిటైర్ కానున్నారు.

మార్చి 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13వ తేదీ నామినేషన్లకు తుదిగడువు. మార్చి 16న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు మార్చి 18 వ తేదీ. మార్చి 26 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నారు.