English | Telugu
బహిరంగంగానే తిట్టుకుంటున్న వైసీపీ నేతలు
Updated : Nov 23, 2020
తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ సమావేశం రసాభాసగా మారింది. టిడ్కో ఇళ్లు విషయంలో కాకినాడలో అవినీతి జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కేకలు వేశారు. ఒకే పార్టీ లో ఉంటూ నాకు చెప్పాలి కదా అని బోసుపై దుర్భాషలాడారు. మేడ లైన్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు వల్లే కాకినాడ నగరం మునిగిపోయిందని కూడా బోస్ ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే ద్వారంపూడి మరింత రెచ్చిపోయారు. ఈ విషయాలు తనకు చెప్పాలి కదా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే ద్వారంపూడికి మంత్రి కన్నబాబు, ఇతర ఎమ్మెల్యేలు నచ్చజెప్పారు. దీంతో రాసభాస మధ్య సమావేశం అర్థాంతరంగా ముగిసిపోయింది.