English | Telugu
రౌడీ ముదిరి రాజకీయ నాయకుడైతే మంత్రి కొడాలి నాని!!
Updated : Sep 5, 2020
అసలు మాటిమాటికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడనే నాని, ఆరోజు జరిగిన పరిణామాలకు తనే స్క్రిప్ట్ రాశాడా?. స్వర్గీయ ఎన్టీఆర్ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా స్టెరాయిడ్స్ ఎవరిచ్చారో, సూట్ కేసులు ఎవరు తరలించారో నానీకి తెలియదా? అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తండ్రి అయిన ఖర్జూర నాయుడి గారి కుటుంబం రౌడీయిజంతోను, ఫ్యాక్షనిజంతోను పైకి రాలేదని అన్నారు. అసలు చంద్రబాబు వయస్సు గురించి, చావుల గురించి మాట్లాడటానికి మంత్రి ఏమైనా యమధర్మరాజుకి శిష్యుడా?. ఇప్పటికైనా సరే, వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబుతో సమానంగా ఎవరైనా పనిచేయగలరా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు గురించి ఒకసారి ఒక పేపర్‌లో చులకనగా రాశారని గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును.. నాని లాంటి వాళ్లు ఎన్ని మాటలన్నా, ఆయన తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా కదలదు. మంత్రిస్థాయిలో ఉండి లారీలతో గుద్దిస్తామనే ఆలోచనలు చేయడం బాధాకరం అని అంటూ.. లక్షకోట్ల అప్పులు తెచ్చి, ఏం చేశారో చెప్పకుండా, కేవలం ప్రశ్నించినవారిని చంపేస్తాం.. లేపేస్తాం అని బెదిరిస్తారా.. సీఎం జగన్ ప్రజలసొమ్ముని కోర్టు ఖర్చులకు దుబారా చేయకుండా, ఆ సొమ్ముతో తన సొంత పార్టీవారికి సభ్యత, సంస్కారాలు నేర్పితే మంచిది. ఇక మంత్రి నానినుద్దేశించి మాట్లాడుతూ.. మొరటోడికి మొగలిపువ్వు ఇస్తే, ఎక్కడో పెట్టుకున్నట్టు, మంత్రి పదవితో నాని ఏం చేస్తున్నాడో తెలియడం లేదు అని నానిపై దివ్యవాణి తీవ్ర విమర్శలు చేశారు.