English | Telugu
జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమ...
Updated : Oct 5, 2019
మాజీ మంత్రి దేవినేని ఉమా విజయవాడ మీడియాతో మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి విషయంలో వైయస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజానికి ఏమి సందేశం ఇవ్వబోతున్నారని, భక్తుల మనోభావాలని ఏ విధంగా కాపాడబోతున్నారో రాష్ట్ర ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి గారు వివరణివ్వాలని కోరారు. ఈరోజు మూలా నక్షత్రం, కనకదుర్గమ్మ తల్లి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని, ప్రభుత్వ పెద్దలు మూలా నక్షత్రం రోజు సూర్యోదయం తరువాత స్వామి వారికి పట్టువస్త్రాలు ఇవ్వటం అనేది సాప్రదాయంగా వస్తుందనీ, ఆ సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి నిన్న మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో వచ్చి బట్టలు ఇచ్చి వెళతాం లేదా ఆరు తరువాత వచ్చి ఒక ఐదు నిమిషాల్లో ఇచ్చి వెళతాం ఎలా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారం చాలా మంది భక్తుల మనోభావాలతో ముడి పడి ఉందని ఇదేమీ అంత ఆషామాషీగా తీసుకునే వ్యవహారం కాదని దేవినేని ఉమ అన్నారు. ఇప్పటివరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు భక్తి శ్రధ్ధలతో అమ్మవారికి పట్టువస్త్రాలు ఇచ్చారని కానీ, జగన్ గారు ఢిల్లీ పర్యటనను దృష్టిలో పెట్టుకుని అలా వచ్చి ఇలా వెళ్ళారని పత్రికలో చూశానని, సూర్యోదయం అయిన తరువాత మూల నక్షత్రం నాడు అమ్మవారికి పట్టువస్త్రాలు ఇవ్వడానికి కూడా తీరిక లేదా అని జగన్ ను దేవినేని ఉమా ప్రశ్నించారు. కనీసం మీడియా ముందుకొచ్చి అమ్మవారి ప్రాముఖ్యత గురించి మాట్లాడకుండా దేవాలయం విషయంలో మీరు చేసిన ఘనకార్యాల గురించి ఎక్కడ అడుగుతారో అని నోరు తెరవకుండానే ఆలయం నుంచి జగన్ వెళ్ళారని విమర్శించారు. జగన్ ది రావణాసుర పరిపాలన అని దేవినేని ఉమా అన్నారు.