English | Telugu

తెలంగాణ ఆర్టీసీ సమ్మే సెగ ఇక పై సిటీ బస్సులకు కూడానా ?

తెలంగాణ ఆర్టీసీ సమ్మే కారణంగా హైదరాబాద్ లోని సిటీ బస్సులు కూడా అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మెట్రో ట్రైన్ లు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి అదనపు సర్వీసును నడుపుతున్నారు. మెట్రో అదనపు సర్వీసు వల్ల చాలా వరకు మేలు జరగుతోందని చెప్పాలి. సాధారణంగా ఉదయం పూట ఐదు గంటల నుంచి కూడా మెట్రో సర్వీసులు ఎప్పుడు ప్రారంభం అవ్వవు, కాని ఈ సమ్మె నేపథ్యంలో ఉదయం ఐదు గంటల నుంచి కూడా మెట్రో ట్రైన్లను ప్రారంభించారు. గత కొన్ని రోజుల నుంచి చెప్పినటువంటి సమ్మె ఒక్కసారిగా అయ్యిందని చెప్పుకోవాలి. దాదాపు ప్రతి రోజూ ఐదు వేల బస్సులు నడుస్తాయి, అలాంటిది ఇప్పుడు పండుగ సీజన్ కాబట్టి ఒక పదహైదు వందల ఎక్స్ట్రా బస్సులు నడుస్తాయి. మొత్తం ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల బస్సులు దాకా నడుస్తాయి. కానీ ఇప్పుడు ఒక్క బస్సు కూడా అందుబాటులో లేకపోవటంతోటి పబ్లిక్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే ప్రతి రోజూ కూడా రెండు లక్షల ఇరవై వేల మంది పబ్లిక్ ఈ సిటీ బస్సులలో ప్రయాణం చేస్తుంటారు. ఫెస్టివల్ కాబట్టి రెండు లక్షల డెబ్బై ఐదు నుంచి మూడు లక్షల వరకు కూడా పబ్లిక్ ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు మొత్తం కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.దీనికి వల్ల ఇబ్బందులు ఉన్నందున మెట్రో అధికారులు నిన్న అత్యవసర మీటింగ్ ని ఏర్పాటు చేసుకొని, మెట్రో సర్వీసులను అదనంగా నడపాలని కూడా ఆ మీటింగ్ లో నిర్వహించారు. దీని కారణంగా ఉదయం ఐదు గంటల నుంచి మెట్రో ట్రైన్స్ అందుబాటులోకొస్తున్నాయి. సాధారణంగా ఐదు నిమిషాలకు ఒకసారి మెట్రో అందుబాటులో కొస్తే ప్రస్తుతం ఆఫీసులకు,సెలవులు గడిపేవారికి రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మూడు నిమిషాలకు ఒకసారి కూడా ప్రస్తుతం మెట్రో నడిచేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. అలాగే ఎక్కడా ఇబ్బంది కలగకుండా రష్ ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి అమీర్ పేట్, కూకట్ పల్లి ఇంకా కొన్ని ప్రాంతాలల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు మెట్రో అధికారులు.సిటీ బస్సుల సైతం నిలిచిపోతే ఇక ముందు పరిస్థితి ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.