English | Telugu

వైసీపీ నేతలు భూకబ్జాదారులు.. మంత్రులు పొద్దెరగని బిచ్చగాళ్లు! 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, జగన్ కేబినెట్ లోని మంత్రులపై సంచలన ఆరోపణలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వైసీపీ నేతలు భూ కబ్జాదారులని చెప్పారు. వైసీపీ నేతల భూ ఆక్రమణలను ఆధారాలతో నిరూపిస్తానంటూ సీఎం జగన్ కు సవాల్ చేశారు నారాయణ. గుంటూరు, విశాఖలో భూ దోపిడీకి పాల్పడింది వైసీపీ నేతలేనని చెప్పారు. అవినీతిలో పుట్టి పెరిగిన వ్యక్తులు జగన్, విజయసాయిరెడ్డి అని వ్యాఖ్యానించారు నారాయణ. వైసీపీ మంత్రులు పొద్దెరగని బిచ్చగాళ్లని విమర్శించారు. తిరుమలలో ఇతర మతాల గురించి మాట్లాడడం ఏంటి? అవంతి, నారాయణస్వామి లాంటి మంత్రులు ఏపీకి అవసరమా? అని సీపీఐ నారాయణ ప్రశ్నించారు.