English | Telugu

ఏపీలో 1400 దాటిన కరోనా కేసులు!


ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది.. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1400 దాటేసింది.. గత 24 గంటల్లో 71 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు ఏపీ స్టేట్ కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ విడుదల చేసిన బులెటిన్ నంబర్ 140లో పేర్కొంది. తాజాగా నమోదైన 71 కేసులతో కలిపి.. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1403కు చేరింది. ఇక, 321 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు 31 మంది మృతిచెందారు. ప్రస్తుతం 1051 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 24 గంటల్లో మొత్తం 6,497 సాంపిల్స్ పరీక్షించగా 71 మందికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు.

గత 24 గంటల్లో నమోదైన కేసులు పరిశీలిస్తే అత్యధికంగా కర్నూలులో 43 నమోదు కాగా.. కృష్ణా జిల్లాల్లో 10 కేసులు, గుంటూరు, కడపలో నాలుగు చొప్పున, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మూడు చొప్పున, తూర్పుగోదావరి, నెల్లూరులో రెండు కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇక, 386 పాజిటివ్ కేసులతో ఇప్పటి వరకు కర్నూలు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. గుంటూరులో 287, కృష్ణా జిల్లాల్లో 246, నెల్లూరులో 84, చిత్తూరులో 80 కేసులు నమోదయ్యాయి.