English | Telugu
చేగూర్ గ్రామాన్ని తనికీ చేసిన కలెక్టర్ అమయ్ కుమార్
Updated : Apr 4, 2020
మృతురాలి నివాసం, పరిసర ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావకపు మందును విస్తృతంగా స్ప్రే చేయించారు. మృతురాలి తో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లో ఎవరెవరున్నారో వారిని గుర్తించి సిపార్డ్ లోని క్వారంటైన్ కేంద్రానికి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మిగిలిన వారిని తమ ఇళ్లలోనే క్వారంటైన్ చేపట్టాలని సూచించారు. కలెక్టర్ అమయ్ కుమార్ తో పాటు అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.