English | Telugu

చిత్తూరు జిల్లా కంపెనీలలో కరోనా వైరస్ టెస్టులు నిర్వహిస్తున్న వైద్య శాఖ

కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. తిరుపతి సమీపంలోని పలు కంపెనీల్లో పని చేస్తున్న చైనా దేశస్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించుకుంది. ఈ మేరకు రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు అధికారులు. రేణిగుంట ఎయిర్ పోర్టు ప్రాంతంలో ఉన్న పరిశ్రమల్లో పని చేస్తున్న చైనాకు చెందిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సహకరించాలని ఆయా కంపెనీల యాజమాన్యాలకు డీఎంఅండీహెచ్ ఓ లేఖలు అందజేసింది.

చిత్తూరు చుట్టుపక్కల హెక్సెను టిసిఎల్ లాంటి ఎనిమిది నుంచి పది కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో ప్రధానంగా హెక్సెను టిసిఎల్ లోనే చైనాకు సంబంధించిన వాళ్లు పని చేస్తున్నారు. కాబట్టి కరోనా వైరస్ అంటే డిసెంబర్, జనవరి మాసాల లోనే అది ఎక్స్ పోజ్ కావడంతో ఈ మాసాల్లో చైనా నుంచి తిరుపతికి రాకపోకలు సాగించిన వాళ్లకి ఏదైనా కరోనాకి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కరోనా పై భయాందోళనకు గురవుతున్న చైనా ఉద్యోగులతో కలిసి స్థానికంగా ఉన్నవాళ్లు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్లతో పని చేసే సమయంలో వీళ్ళలో ఉన్న భయాందోళన ఏ విధంగా ఉన్నాయో ఒకవేళ వీళ్లకు ఏదైనా జలుబు, జ్వరం లాంటివి ఉంటే ప్రాథమికంగా స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నారు.