English | Telugu

రోడ్డుపై భ‌య‌పెట్టిన 500 రూపాయ‌ల నోట్లు!

ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ ప్రజలు రోడ్డు మీద ప‌డి వున్న 500 రూపాయ‌ల నోట్ల‌ను చూసి తెగ హైరానా ప‌డిపోయార‌ట‌. ప‌క్కాగా ఈ నోటుపై క‌రోనా వైరస్ ఉంద‌నేది వారి అనుమానం. స్థానిక పేపర్‌ మిల్‌ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి రోడ్డుపై రెండు 500 రూపాయ‌ల‌ నోట్లు రోడ్డుపై ప‌డివుండ‌టాన్ని చూసిన స్థానిక వ్య‌క్తి హ‌డావిడి చేసేశాడ‌ట‌. కరోనా వ్యాప్తికై ఎవరో చేసిన కుట్రగా భావించి వెంటనే పోలీసుల‌కు సమాచారం ఇచ్చాడ‌ట‌. పోలీసులు, ఆ నోట్లను స్వాధీనపరచుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. రోడ్డు మీద డ‌బ్బు దొరికినా జ‌నానికి క‌రోనానే గుర్తుకు రావడాన్నిస్థానికులు ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నారు.