English | Telugu

ఏపీలో పాజిటివ్ కేసులు సంఖ్య 132

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇంతవరకు ప్రపంచాన్ని గడగడ లాడించిన ఏ వైరస్ ఏపీ ప్ర‌జ‌ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ వైరస్ ఉన్న వ్యక్తి ముట్టుకున్న ఏ వస్తువును ముట్టుకున్నా ఇంకొకరికి సోకవడం వల్లే ఇది ఇంత వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రంగా విస్తరిస్తోంది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 132కు చేరుకుంది. ఇందులో 70 మంది ఢిల్లీ వెళ్లివచ్చిన వారివి లేదా వారితో లింకులు ఉన్నవాళ్లు వున్నారు. బుధవారం ఒక్కరోజే 67 కొత్త పాజిటివ్ కేసులు నమోదైయాయి.

జిల్లాల వారిగా చూస్తే

అనంతపురం - 2

చిత్తూరు - 8

తూర్పుగోదావరి - 9

గుంటూరు - 20

కడప - 15

కృష్ణ - 15

కర్నూలు - 1

నెల్లూరు - 20

ప్రకాశం - 17

విశాఖపట్నం - 11

పశ్చిమగోదావరి - 14

ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాజిటివ్గా తేలినవారిలో ఎక్కువ మంది ఢిల్లీ వెళ్లివచ్చినవారు - వారితో సన్నిహితంగా ఉన్నవారేనని తెలుస్తోంది.

ఇదిలావుంటే కరోనాపై సీఎం జగన్‌ బాధ్యత లేకుండా మాట్లాడారని తెలుగుదేశం పార్టీ విమ‌ర్శిస్తోంది. కరోనా జ్వరంలాంటిదేనని, భయంలేదని సీఎం జగన్ ఎలా అంటారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.