English | Telugu
ఏపీలో కరోనా వైరస్... రాజధాని ప్రజలారా అప్రమత్తం కండి!!
Updated : Feb 6, 2020
చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. ఆంధ్రప్రదేశ్ ని తాకిందా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఒకరికి కరోనా సోకిందనే వార్త కలకలం రేపుతోంది. కరోనా లక్షణాలతో ఒకరు హాస్పిటల్ లో చేరగా, కరోనా సోకినట్లు నిర్దారించారని తెలుస్తోంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కేసు నమోదు అయినట్లుగా.. హాస్పిటల్ సూపరింటెండెంట్ అంగీకరించారని వార్తలొస్తున్నాయి.
చైనాలో ఎంబీబీఎస్ చదువుతోన్న అవనిగడ్డకి చెందిన ఓ స్టూడెంట్ కి కరోనా లక్షణాలు ఉన్నాయని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయవాడలో నమోదైన కేసు, అవనిగడ్డ స్టూడెంట్ ఒక్కరేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉంటే, ప్రభుత్వ వర్గాలు మాత్రం.. ఈ వార్తల్లో నిజంలేదు అంటున్నాయి. ఇంతవరకు కరోనా కేసు నిర్దారణ కాలేదు అని చెప్పుకొస్తున్నాయి. నిజంగానే కరోనా కేసు నమోదు కాలేదా? లేక ప్రజలు భయబ్రాంతులకు గురవుతారని ప్రభుత్వం నిజం దాస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా అమరావతి పరిసర ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.