English | Telugu
127 దేశాల్లో కరోనా విలయం తాండవం 4,973 మంది మృతి
Updated : Mar 13, 2020
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. 127 దేశాలకు కరోనా వైరస్ సోకిందింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 4 వేల 972కి చేరింది. 1 లక్షా, 34 వేల 558 మంది కరోనా బాధితులు ఉన్నారు. 5 వేల 994 మందికి సీరియస్ గా ఉంది.
భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో అనౌన్స్ చేసింది. దీంతో భారత్ లోని అని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాయి.
భారత్‌లో తొలి కరోనా మృతి నమోదైంది. కర్ణాటకకు చెందిన 76ఏళ్ల మహమ్మద్ హుస్సేన్ ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి మరణించారు. తొలి మరణం. భారత్‌లో నమోదైన తొలి కరోనా మృతి.
ముంబైకి చెందిన 26ఏళ్ల యువకుడు బెంగళూరులోని గూగుల్ ఆఫీసులో జాబ్ చేస్తున్నాడు. గత ఫిబ్రవరి 23న తన భార్యతో కలిసి గ్రీస్ దేశానికి హనీమూన్‌కు వెళ్లాడు. హనీమూన్ నుంచి మార్చి 6న ముంబైకి తిరిగొచ్చారు. మార్చి 8న ముంబై నుంచి బెంగళూరు చేరుకున్నారు. ఈ క్రమంలో అతడికి టెస్టులు నిర్వహించగా కోవిడ్19 పాజిటీవ్‌గా తేలినట్లు గూగుల్ ఇండియా ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
హనీమూన్ నుంచి తిరిగొచ్చిన ఆ టెకీ మార్చి 9న తిరిగి బెంగళూరు ఆఫీసుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆ టెకీకి కరోనా వైరస్ లక్షాలున్నట్లు గుర్తించామని, దీంతో ఇతర ఉద్యోగులపై దీని ప్రభావం పడకుండా ఆయనను జయనగర్ జనరల్ హాస్పిటల్‌కు తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కరోనా వైరస్‌పై సమాచారం అందించేందుకు తెలంగాణ హెల్ప్‌లైన్ నెంబర్ - 104
ఆంధ్రప్రదేశ్ హెల్ప్‌లైన్ నెంబర్ - 0866 2410978.
1. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి.
2. ఆంధ్ర మెడికల్ కాలేజీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
3. జిఎంసి, అనంతపురం, ఆంధ్రప్రదేశ్ ఈ ఆసుపత్రులు
కరోనా వైరస్ పరీక్ష అందుబాటులో వున్నాయి.