English | Telugu

భారత్‌ లో ఒక్కరోజులో 648 కరోనా మరణాలు

భారత్‌ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 37,724 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 648 మంది కరోనా కారణంగా మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,92,915కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 28,732కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 7,53,050 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 4,11,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి.