English | Telugu

ఎంపీ విజయ్ సాయి రెడ్డికి కరోనా.. హైదరాబాద్ అపోలోలో ట్రీట్ మెంట్

వైసీపీ లో ముఖ్య నేత ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కొద్ది రోజుల క్రితం విశాఖలో సంజీవని బస్సు ప్రారంభోత్సవంలో భాగంగా అయన టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. ఐతే గత కొద్దీ రోజులుగా స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో మళ్ళీ టెస్ట్ చేయించుకోగా నిన్న పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఉత్తమ చికిత్స కోసం అయన జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇదే సమయంలో అయన పిఏకు కూడా కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. కరోనా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విజయసాయిరెడ్డి విస్తృతంగా పర్యటించారు. అటు సీఎం జగన్ తో సహా పలువురు వైసీపీ ముఖ్య నేతలతో అయన సమావేశాలు నిర్వహించారు. ఐతే కొన్ని సందర్భాల్లో విజయసాయిరెడ్డి మాస్క్‌ కూడా ధరించలేదు. వారం పది రోజల పాటు క్వారంటైన్‌లో తాను ఉండనున్నట్లు ఆయన తాజాగా ట్వీట్‌ చేశారు. అత్యవసరమైతేనే ఫోన్‌లో అందుబాటులోకి వస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా కరోనా సోకినా ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్య నేతలందరూ ఇతర రాష్ట్రాలలో చికిత్స తీసుకోవడం ఇపుడు విమర్శలకు దారి తీస్తోంది. రాష్ట్రంలో కరోనా చికిత్సకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పుకుంటున్న వైసిపి నేతలు ఇలా పొరుగు రాష్ట్రాలలోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ తీసుకోవడం ప్రజలను ఆశ్చర్యానికి ఆందోళనకు గురి చేస్తోంది.