English | Telugu

రాష్ట్రంలో ఒక్కరోజే 149 మంది కరోనాతో మృతి!!

భారత్ లో గత 24 గంటల్లో దేశంలో 9,996 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 357 మంది కరోనాతో మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,86,579కి చేరగా, మృతుల సంఖ్య 8,102కి చేరుకుంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,41,029 మంది కోలుకోగా.. ప్రస్తుతం 1,37,448 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక, మహారాష్ట్రలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా మహారాష్ట్రను కలవరపెడుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 3,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, బుధవారం ఒక్కరోజే 149 మంది కరోనాతో. దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 357 మంది ప్రాణాలు కోల్పోతే, అందులో ఒక్క మహారాష్ట్రలోనే 149 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఆ రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94,041 కాగా.. కరోనా మరణాల సంఖ్య 3438 కి చేరింది.