ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 15,911 శాంపిల్స్ ను పరీక్షించగా 193 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. గడచిన 24 గంటల్లో కరోనాతో ఏపీలో ఇద్దరు మరణించారు. చిత్తూరులో ఒకరు, ప్రకాశం జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 5280 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా మరణాల సంఖ్య 88కి పెరిగింది. తాజాగా, 81 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 2,851 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 2,341 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.