English | Telugu
చినజీయర్ ఎందుకు స్పందించరు? కేసీఆర్ పై వీహెచ్ కీలక వ్యాఖ్యలు
Updated : Nov 21, 2019
వీహెచ్ మాట్లాడుతుంటే ఒక్కోసారి కామెడీగా అనిపిస్తుంది కానీ... చాలా మంది టీకాంగ్రెస్ లీడర్లతో పోలిస్తే... హైపర్ యాక్టివ్ గా పనిచేస్తారు. 70ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా పోరాట పటిమ చూపిస్తారు. ఇష్యూ ఏదైనా వేగంగా స్పందిస్తారు. బాధితులను కలిసి భరోసా నింపుతారు. ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడటంలో వీహెచ్ స్టైలే వేరు. వీహెచ్ ఏం మాట్లాడినా మీనింగ్ ఫుల్ గానే ఉంటుంది. ఏదిపడితే అది మాట్లాకుండా పాయింట్ టు పాయింటే మాట్లాడతారు.
తాజాగా, అధ్యాత్మికవేత్త చినజీయర్‌స్వామిపై వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెలన్నర రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే... చినజీయర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే పాతిక మందికి పైగా కార్మికులు చనిపోయారన్న వీహెచ్... ఇవన్నీ చినజీయర్ కు కనిపించడం లేదా అంటూ నిలదీశారు. కేసీఆర్ మీరు గీసిన దాటరు కదా... మరి ఎందుకు ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయమని ముఖ్యమంత్రికి చెప్పడం లేదంటూ ప్రశ్నించారు. కార్మికులు, పేదల కష్టాలపై స్పందించినప్పుడే చినజీయర్ స్వామి ప్రవచనాలకు అర్ధముంటుందన్నారు. ఇప్పటికైనా... ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సలహా ఇవ్వాలని చినజీయర్‌కు సూచించారు.
ఇక, రెవెన్యూశాఖలో అవినీతిపైనా వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ యంత్రాంగం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని వీహెచ్ ఆరోపించారు. లంచం ఇవ్వనిదే ఏ పనీ జరగడం లేదని, అందుకే ప్రజలు పెట్రోల్ బాటిల్స్ పట్టుకుని ఎమ్మార్వో కార్యాలయాలకు వెళ్తున్నారని అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి.... రెవెన్యూశాఖ ప్రక్షాళన చేయాలని కోరారు.