English | Telugu

అంతా బాగుంటే లాక్డౌన్ పొడిగించుడు ఎందుకో!

కచరా పాలనలో ముక్కుకి, నోటికే కాదు, కంటికీ, చెవులకి కూడా మాస్కులు. దేశంలో అతి తక్కువ కరోనా పరీక్షలు తెలంగాణాలో జ‌రిగాయి. మరణాలు దాచిపెట్టుడు కూడా తెలంగాణాలోనే జ‌రిగింది. మల్ల అంతా బాగుంటే లాక్డౌన్ పొడిగించుడు ఎందుకో. అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.

రైతు దీక్షను చూసి తట్టుకోలేక కేసీఆర్ అహంకారంగా మాట్లాడుతున్నారు. ఆయనే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.
కేసీఆర్ అహంకారమే ఆయన పతనానికి దారితీస్తుందని జ‌గ్గారెడ్డి అన్నారు. కుర్చీ పోయిన తెల్లారి నిన్ను కుక్కలు కూడా పట్టించుకోవు. పదవిపోయిన తెల్లారి నీ కుటుంబ సభ్యులెవరు నీ వెంట వుండరు. ఆ విష‌యాన్ని గుర్తుపెట్టుకొని అహంకారాన్ని త‌గ్గించుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం వల్లనే నీవు సీఎం అయ్యావు.
సోనియా ను ఒప్పించి తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ నాయకులు బఫ్యూన్ గాళ్ళు అయ్యారా? తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తి కేసీఆర్ అంటూ జ‌గ్గారెడ్డి ఘాటాగా స్పందించారు.

రైతు సమస్యలు మాట్లాడితే చిల్లగాళ్లంటావా? చిల్లరగాళ్లని రైతులను అవమానిస్తారా? ప్రగతి భవన్ లో మీరు ఉన్నట్టు రైతులందరూ సుఖంగా లేరుని జ‌గ్గారెడ్డి అన్నారు. తాగండి, సావండి, ఖజానా నింపండి, అన్న‌ట్లుగా ఉంది కేసీఆర్ వైఖరి అని ఆయ‌న విమ‌ర్శించారు.