English | Telugu
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం ఆవేదన!
Updated : May 7, 2020
బాధితులను కాపాడేందుకు అంబులెన్స్‌లు, మెడికల్ కిట్‌లతో భారత నావికాదళం రంగంలోకి దిగింది. రసాయన వాయువు ప్రభావానికి వెంకటాపురం గ్రామంలోని మూగజీవాలు మృత్యువాత పడగా, చెట్లన్నీ రంగు మారాయి. ఈ వాయువు గాల్లోకి వ్యాపిస్తుండడంతో.. పరిసర గ్రామాల ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.