ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, తాజాగా వైసీపీకి చెందిన మరో కీలక నేత కరోనా బారిన పడ్డారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అంబటి రాంబాబును కలిసిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు వారందరికీ కరోనా పరీక్షలు చేయనున్నారు.
కాగా, అంబటి రాంబాబుకు చేసిన టెస్టులపై కాస్త గందరగోళం నెలకొంది. స్వాబ్ టెస్టులో భిన్నమైన ఫలితాలు వెలుగు చూశాయి. సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన టెస్టులో ఒకసారి నెగటివ్, మరోసారి చేసిన పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.