English | Telugu
తప్పుడు ప్రచారం చేసేవారికే కరోనా రావాలి!
Updated : Mar 29, 2020
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసకార్మికుల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర పునర్ నిర్మాణ ప్రక్రియలో ఈ కార్మికులు తెలంగాణాకు పార్టనర్స్. వారిని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. ఆహార వసతితో పాటు మెడికల్ కేర్ తీసుకోవాలి. అవసరమైతే ఫంక్షన్ హాల్‌లో నైనా వంట చేసి భోజనం పెట్టండి. ఎవరూ ఆకలితో బాధపడవద్దు. వలస కార్మికులు ఏ స్టేట్‌కు చెందిన వారైనా ఆదుకుంటాం.
కరోనా విస్పోటనం ఎలా వుంటుందో తెలియదు. కాబట్టి అప్రమత్తంగా వుందామని ముఖ్యమంత్రి సూచించారు.
వలస కార్మికులు ఏ స్టేట్‌కు చెందినవారైనా మీరంతా మా సహోదరులు. మీకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పిస్తాం. ధైర్యంగా వుండండని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
మీ రాష్ట్రాలకు వెళ్లిపోవాలని అనుకోవద్దు. మా కుటుంబసభ్యుల్లా మిమ్మల్ని కాపాడుకుంటా. 12 కిలోల రేషన్ ఇస్తాం. ఒక్కో మనిషికి 500 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తాం.
పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాలి. అప్రమత్తంగా వుంటేనే కరోనా కాటునుంచి కాపాడుకోగలుగుతాం. ఇండోనేషియా దరిద్రుల కారణంగా 10 మందికి వచ్చింది. నిన్న ఖైరతాబాద్‌లో సచ్చిన వాడు కూడా మన కంట్రోల్‌లో చనిపోలేదు. బ్రతికి వున్నప్పుడు వస్తే బ్రతికించే వాళ్ళాం. చనిపోయిన తరువాత టెస్ట్ చేస్తే ఆ వృధ్దుడికి పాజిటివ్ వచ్చింది.
గుంపులుగా జమా కాకుండా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తమ పంటను అమ్ముకోవాలని సూచించారు.
చిల్లర దందాలకు పాల్పడిన వారికి కరోనా సోకాలని సి.ఎం. శాపం ఇచ్చారు. కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ న్యాయబద్దంగా వ్యవహరించాలని సి.ఎం సూచించారు.