English | Telugu

కరోనా కు చైనా వ్యాక్సిన్ రెడీ.. ముందుగా వారికేనట

ప్రపంచం మొత్తం కరోనా తో విలవిలలాడుతోంది. ఐతే ఈ కరోనా ను ప్రపంచం పైకి వదిలిన చైనా మీద ప్రపంచ దేశాలన్నీ గుర్రుగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కరోనా కు పుట్టినిల్లైన చైనా లో కరోనా కు వ్యాక్సిన్ సిద్దమైందని వార్తలు వస్తున్నాయి. చైనా డ్రగ్ మేకర్ కాన్సీనో బయోలాజిక్స్ యొక్క Ad5-nCoV వ్యాక్సిన్ ట్రయల్స్ అన్ని పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది. ఐతే ఈ వ్యాక్సిన్ ను ఒక సంవత్సరం పాటు పూర్తిగా తన దేశ సైనికులకు మాత్రమే ఇవ్వాలని చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరో పక్క ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న మరో వ్యాక్సిన్.. అయిన అమెరికన్ వ్యాక్సిన్ మోడెర్నా మూడో పేజ్ ట్రయల్స్ వాయిదా పడ్డాయి. మొన్న జులై 9న ప్రారంభం కావాల్సిన మూడో దశ ట్రయల్స్ ట్రయల్ ప్రొటొకాల్స్ లో మార్పుల వల్ల వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.