English | Telugu

ఏపీని దేవుడే రక్షించాలి.. చంద్రబాబు ట్వీట్! 

క‌రోనా వైరస్ ను కేవలం జ్వరమంటూ నిర్ల‌క్ష్యంగా మాట్లాడ‌తారా అంటూ సీఎం జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్ అయ్యారు.

ముఖ్య‌మంత్రి వ్యాఖ్యలు అయన నిర్లక్ష్యానికి నిదర్శనం అని బాబు అన్నారు. ఈ మేరకు జగన్ మాట్లాడిన వీడియోను చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. కరోనా వైరస్ కేవలం జ్వరమేనని ప్రతిసారి చెప్పే వ్యక్తుల గురించి ఏం మాట్లాడాలని చంద్రబాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఈ డెడ్లీ వైరస్ బాధితుల్లో సౌత్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, ప్రజల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని తెలుస్తోందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రాన్ని దేవుడు రక్షించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.

సీఎం జగన్ మీడియాతో మాట్లాడిన తీరు ఆయ‌న నిర్లక్ష్యానికి నిదర్శమని బాబు అన్నారు. కరోనా బాధితులను అంటరానివారిగా చూడొద్దని సీఎం జగన్ అన్నారు. కరోనా నాతో సహా ఎవరికైనా రావచ్చుని, రాబోయే కాలంలో ప్రజలు కరోనా కలిసి జీవించాల్సి ఉంటుంది. ప్రజలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, కరోనాపై అనవసర భయాలు పెట్టుకోవద్దు అన్నారు. కరోనా ఒక జ్వరం లాంటిది అన్నారు. ఎవరికి వస్తుందో తెలియడం కష్టమన్నారు. సామాజిక దూరం పాటించడం అవసరం. రాష్ట్రంలోని గ్రీన్ జోన్స్ ప్రాంతాలలో కరోనా రాకుండా జాగ్రత్త పడాల్సి అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అయితే సీఎం అన్న ఈ వ్యాఖ్యలను జోడిస్తూ ముఖ్య‌మంత్రి తీరును చంద్రబాబు తప్పుబట్టారు.